- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె..
by Aamani |
X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తమ ఉద్యోగాలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న నిరసన కార్యక్రమాలు 14 రోజుకు చేరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తమ ఉద్యోగాలను రిగ్యూలరైజ్ చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని నినదించారు. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ఎదుట వంట వార్పు నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి భోజనం చేశారు. 14 రోజులుగా రోజుకో విధంగా వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతూ సమ్మె ఉధృతం గా సాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు పాండు, తిరుపతి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story