Harish Rao: వాళ్లందరినీ తొక్కి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.. హరీష్ రావు హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-23 12:33:16.0  )
Harish Rao: వాళ్లందరినీ తొక్కి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.. హరీష్ రావు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం హరీష్ రావు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఆందోళన చేస్తున్న సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులను పరామర్శించారు. అనంతరం 24 అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 41 శాతం నేరాలు పెరిగాయని అన్నారు. ఏడాదిలో ఇదే రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని తెలిపారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఆయనకు ఇంకేం చేతకాదని విమర్శించారు.

ఎన్నో ఏళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్(Congress) నేతలను తొక్కి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి ప్రజల సమస్యల కంటే.. అల్లు అర్జున్(Allu Arjun) ఇష్యూ ఎక్కువైపోయిందని విమర్శించారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా.. ఇప్పటికీ విద్యా శాఖకు మంత్రి లేరని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 20 వేల సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద పడితే ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. టీ తాగినంత సమయంలోనే సమస్యలు పరిష్కరిస్తా అని మాట తప్పారని విమర్శించారు.


Also Read....

Harish Rao: రాష్ట్రంలో అల్లు అర్జున్‌ సమస్య ఒక్కటే ఉందా?.. సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

Advertisement

Next Story

Most Viewed