Max: పవర్ ఫుల్ యాక్షన్‌తో ‘మ్యాక్స్’ ట్రైలర్

by sudharani |
Max: పవర్ ఫుల్ యాక్షన్‌తో ‘మ్యాక్స్’ ట్రైలర్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ (Action Thriller) ఫిల్మ్ ‘మ్యాక్స్’ (Max). విజయ్ కార్తికేయ ((Vijay Karthikeya)) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar), సునీల్ (Sunil), శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ‘మ్యాక్స్’ డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.

ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ (Trailer) రిలీజ్ చేశారు. ‘మా పొలిటికల్ కెరీర్‌కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో ‘చావు ఎదురొచ్చినా సరే మా అబ్బాయి ఒంటరిగా నిలబడి పోరాడతాడు’ అని హీరో మదర్ చెప్పిన డైలాగ్‌తో కిచ్చా సుదీప్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడ నుంచి ఫుల్ యాక్షన్ స్టార్ట్ అవుతోంది. ఇక ‘మ్యాక్స్‌తో మాట్లాడేటప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్స్ మైంటైన్ చేయాలి’ అనే హీరో మాటలతో ఎండ్ అయిన ఈ ట్రైలర్‌ చూస్తుంటే.. కిచ్చా సుదీప్ యాక్షన్ ప్యాక్డ్, పవర్ ఫుల్ రోల్ చేసినట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed