Harish Rao: రాష్ట్రంలో అల్లు అర్జున్‌ సమస్య ఒక్కటే ఉందా?.. సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

by Gantepaka Srikanth |
Harish Rao: రాష్ట్రంలో అల్లు అర్జున్‌ సమస్య ఒక్కటే ఉందా?.. సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మెదక్ పట్టణంలో సర్వశిక్ష అభియాన్(Sarva Shiksha campaign) ఉద్యోగుల నిరసనకు హరీష్ రావు(Harish Rao) మద్దతు తెలిపారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సమస్యల కంటే అల్లు అర్జున్(Allu Arjun) సమస్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కువైందని విమర్శించారు. ప్రజలు, ఉద్యోగుల సమస్యలు రేవంత్ రెడ్డికి పట్టవా? అని ప్రశ్నించారు. ఈనెల 9వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

ప్రభుత్వ విధానాలను, అసమర్థతను అసెంబ్లీలో నిలదీసినా స్పందన లేదు.. మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారని అన్నారు. మెదక్ చర్చిపై ఒట్టు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని మండిపడ్డారు. ఉన్న పథకాలు ఇవ్వరు.. కొత్త పథకాలు అమలు చేయరు అని సీరియస్ అయ్యారు. పెన్షన్లు పెంచుతామని మోసం చేశారు. మహిళలకు రూ.2500 ఇస్తామని మోసం చేశారు. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారు అని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story