Allu Arjun: జైల్లో అల్లు అర్జున్‌‌‌ను న్యూడ్‌గా ఉంచారా?.. అసలు నిజాలు బయటపెట్టిన కస్తూరి (వీడియో)

by Hamsa |   ( Updated:2024-12-23 16:01:11.0  )
Allu Arjun:  జైల్లో అల్లు అర్జున్‌‌‌ను న్యూడ్‌గా ఉంచారా?.. అసలు నిజాలు బయటపెట్టిన కస్తూరి (వీడియో)
X

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ వల్ల ఆయన ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షోలు వేయగా.. ఇందులో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సంధ్య థియేటర్‌(Sandhya Theater)లో తొక్కిసలాట జరగడంతో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటన అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లడం వల్లే అధిక జనం వచ్చారని అందుకే అలా జరిగిందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు(Chikkadapalli Police) ఐకాన్ స్టార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో వేశారు.

దీంతో అల్లు అర్జున్ తనకు బెయిల్ కావాలని కోర్ట్‌లో పిటిషన్ వేశాడు. అయితే కొన్ని కండీషన్ల మీద హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 6 గంటలపాటు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. ఆ తర్వాత సినీ ప్రముఖులంతా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అయితే ఈ కేసు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. అంతేకాకుండా అల్లు అర్జున్‌పై రాజకీయ నాయకులు, నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి శంకర్(Kasthuri Shankar) సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘జైల్లో బాడీ మొత్తాన్ని ముట్టుకుని చెక్ చేస్తారు. ప్రైవేట్ పార్ట్స్‌లో కూడా ఏమైనా ఉందని చూస్తారు. మూడు సార్లు కింద కూర్చొని లేవమంటారు లోపల ఏదైనా ఉంటే బయటపడుతుందని. నేను అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉన్న వారు నాతో గౌరవంగా ప్రవర్తించారు. కానీ బట్టలు మొత్తం లేకుండా న్యూడ్‌గా చెక్ చేశారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా అదే జరిగి ఉంటుంది. అల్లు అర్జున్‌ను కూడా మొత్తం న్యూడ్‌గా ఉంచి చెక్ చేసి ఉంటారు అనుకున్నాను. అలాగే అతన్ని ఫొటో తీసి, నంబర్ కూడా ఇచ్చారనుకున్నాను. ఎందుకంటే నాకు అలాగే చేశారు కాబట్టి అతనికి కూడా అదే జరిగి ఉంటుంది. అసలు అక్కడ తప్పు చేశారా లేదా అని పట్టించుకోకుండా ప్రవర్తిస్తారు’’ అని చెప్పుకొచ్చింది.


Read More..

CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏకీభవిస్తున్నా.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed