- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూ. 2 లక్షల రుణమాఫీ... మంత్రి తుమ్మల కీలక ప్రకటన

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్నప్పడే లక్ష రుణ మాఫీ ని కూడా ఒకే దఫాలో చేయలేని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మండిపడ్డారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కేసీఆర్ రెండో సారీ అధికారం చేపట్టిన తరువాత కూడా లక్ష రుణ మాఫీకే రైతులను గోస పెట్టి ఎన్నికల వస్తున్నాయని, ఆఖరి సంవత్సరం లో సగం మందికి మాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. సభలో ఆపార్టీ సభ్యులు రుణమాఫీ గురించి మాట్లాడుతుంటే హాస్యస్పదంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించినప్పటికి, ఇచ్చిన మాటకు కట్టుబడి, మొదటి పంట కాలంలోనే రూ. 2 లక్షల లోపు రుణాలను ఒకే దఫాలో 25,35,964 రైతులకు రూ. 20,617 కోట్లు రుణ మాఫీ చేసిన రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీయడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం మీద బురద చల్లి వారి తప్పులను కప్పి పుచ్చుకొనే ప్రయత్నాలను తెలంగాణ సమాజం ఇప్పటికే తిప్పి కొట్టిన విషయం గ్రహిస్తే మంచిదని సూచించారు.
విజయ డైరీ పరిస్ధితులపై రైతు కమిషన్ సమీక్ష సమావేశం
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో విజయడైరీ సంస్థపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. చైర్మన్కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాడి రైతుల నుండి పాల సేకరణ, రవాణా, నాణ్యత, ప్యాకింగ్, మార్కెటింగ్, పాల ఉత్పత్తి పదార్థాల తయారీ, అమ్మకాలపై సుదీర్ఘంగా చర్చించారు. విజయ డైరీ ఆర్థికపరమైన అంశాలు, విజయ డైరీ-ప్రైవేట్ డైరీల మధ్య నెలకొన్న పోటీ పై ప్రస్తావించారు. పాడి రైతు క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కమిషన్ ఈ సమావేశంలో గుర్తుచేసింది. త్వరలో కమిషన్ ఒక నిర్దిష్టమైన పాలసీ రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. దానికంటే ముందు పాడి రైతులతో సమావేశం పెట్టి వారి నుండి అభిప్రాయాలు సేకరించాలని రైతు కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు డైరీ సంస్థ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి, విజయడైరీ సంస్థ జీఎం మార్కెటింగ్ మధుసుధన్ రావు, పాడి రైతు నాయకుడు దేవేందర్ రావు పాల్గొన్నారు.