Pune Accident: పూణేలో మద్యం మత్తులో ట్రక్ డ్రైవర్ వీరంగం.. ముగ్గురు మృతి

by Shamantha N |
Pune Accident: పూణేలో మద్యం మత్తులో ట్రక్ డ్రైవర్ వీరంగం.. ముగ్గురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని(Maharashtra) పూణేలో అర్ధరాత్రి ఘోరప్రమాదం జరిగింది. ఫుట్ పాత్ పై(Pune Footpath) నిద్రిస్తున్న వారిపైకి ట్రక్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. అర్ధారత్రి మద్యం సేవించి ట్రక్ నడుపుతూ వాఘోలి(Wagholi) చౌక్‌ ఏరియాకు వచ్చిన నిందితుడు.. అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి వాహనాన్ని పోనిచ్చాడు. దీంతో, ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ని స్థానికులు పట్టుకున్నారు. అతడ్ని పోలీసులకు అప్పజెప్పారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడు మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌తో పాటు బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితులంతా కూలీలేనని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఆదివారం పూణెేకు వచ్చి నిర్మాణ స్థలాల్లో పని చేశారని స్థానికులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed