- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CV Anand: మీడియాపై వ్యాఖ్యల దుమారం.. సీవీ ఆనంద్ క్షమాపణలు

దిశ, డైనమిక్ బ్యూరో: సంధ్య థియేటర్ ఘటనలో (Sandhya Theater incident) జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) క్షమాపణలు కోరారు. తాను చేసి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తన వ్యక్తిగత ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. 'విచారణ కొనసాగుతున్న సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా రెచ్చగొట్టే ప్రశ్నలు వేయరడంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. నేను చేసింది పొరపాటుగా భావిస్తున్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుంది. నేషనల్ మీడియాపై తాను చేసిన వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుతున్నాను' అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. కాగా నిన్న ప్రెస్ మీట్ నిర్వహించిన సీవీ ఆనంద్.. సంధ్య థియేటర్ ఘటనలో అసలేం జరిగిందో వివరించారు. ఆ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలను ఆయన రిలీజ్ చేశారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు సీవీ ఆనంద్ ను మీడియా ప్రశ్నించింది. దీంతో అల్లు అర్జున్ వ్యవహారంలో నేషనల్ మీడియా అమ్ముడుపోయిందంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ చేశారు.