అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రైతులకు సాయం అందించాలని సూచన

by Ramesh Goud |
అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రైతులకు సాయం అందించాలని సూచన
X

దిశ, వెబ్ డెస్క్: రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు.. వారికి సాయం అందుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) లో ఇటీవల కురిసిన వర్షాలు, వడగళ్ల వాన వల్ల రైతులు (Farmers) పెద్ద ఎత్తున నష్టపోయారు. దీనిపై సీఎం చంద్రబాబు అధికారులతో భేటీ (Meeting With Officials) అయ్యారు. ఈ సందర్భంగా.. అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై సమీక్ష (Review) చేశారు.

వడగళ్ల వాన కారణంగా కడప (Kadapa), అనంతపురం (Anathapuram), సత్యసాయి (Sathyasai), ప్రకాశం (Prakasham) జిల్లాల్లోని 10 మండలాల్లోని 40 గ్రామాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు (Harti Culture Forming) నష్టం జరిగినట్లు గుర్తించామని తెలిపారు. అలాగే అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల జరిగిన పంటనష్టం వివరాలను క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పరిశీలించామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. పంట నష్ట పోయిన వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులకు సూచించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.



Next Story