Pushpa-2: రేవంత్ తీరుతో తెలంగాణ పరువు పోతోంది: ఎంపీ డీకే అరుణ ఆవేదన

by srinivas |
Pushpa-2: రేవంత్ తీరుతో తెలంగాణ పరువు పోతోంది: ఎంపీ డీకే అరుణ ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు అల్లు అర్జున్‌(Allu Arjun)ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) ప్రశ్నించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహరిస్తున్న తీరుపై ఆమె స్పందించారు. అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ సైతం ఇది ఉహించి ఉండరని తెలిపారు. సంధ్య థియేటర్(Sandhya Theatre) ఘటనలో అల్లు అర్జున్ A11గా ఉన్నారని, ఆ ఘటనను రాజకీయం చేసి వాడుకోవడం సరికాదని డీకే అరుణ సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పవర్ ఏంటో చూపించుకోవడానికి చేసినట్లు ఉందని డీకే అరుణ విమర్శించారు. రేవంత్ రెడ్డి సోదరుల ఒత్తిడితో రైతు ఆత్మహత్య చేసుకున్నారని, మరి రేవంత్ రెడ్డి వెళ్లి పరామర్శించారా..?, అప్పుడు ఆయనపైనా కేసు పెట్టాలి కదా అని ఆమె ప్రశ్నించారు. సంధ్య ధియేటర్ వివాదంతో తెలంగాణ పరువు పోతోందని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పేరు మర్చిపోయారని కేటీఆర్ ట్రోల్ చేసినందుకే అల్లు అర్జున్‌ను ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అల్లు అర్జున్‌ను బలి పశువు చేయడం సరికాదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ పంతాలకు పోయి సినీ రంగాన్ని ఆగం చేయొద్దని బీజేపీ ఎంపీ డీకే అరుణ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed