- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR: ‘కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారా..?’ రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారా..? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు (ఆదివారం) ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన కేటీఆర్.. ‘‘రాహుల్ గాంధీ గారూ.. మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం? అదాని - అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం? దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది? కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది? అదాని -అంబానీలపై మీ జంగ్ రామన్నపేటలో అదాని ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచింది? తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా!ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా? కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా? రేవంత్ - అదానీలతో వ్యాపార బంధమా? అదాని - అంబానీలపై మీ పోరాటం ఓ బూటకం. తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.