- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth: రికార్డు స్థాయిలో వరి దిగుబడి : తెలంగాణ రైతులపై సీఎం ప్రశంసలు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో వరి దిగుబడి పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల (Telangana Farmers) ఘనత ఇది అని ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరిసాగు పెరిగిందని (Highest Paddy Production) బీఆర్ఎస్ చేసిన ప్రచారం తప్పని తేలిపోయిందన్నారు సీఎం రేవంత్. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి.. నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా.. ఎన్డీఎస్ఏ(NDS) సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా.. కాళేశ్వరంతో (Kaleshwaram Project) సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్నారు.
"ఇది తెలంగాణ రైతుల ఘనత.. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం.. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు" అని రేవంత్ ఆ పోస్టులో పేర్కొన్నారు. గతేడాది 65.94 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా.. 144.8 లక్షల టన్నుల వరి పంట ఉత్పత్తి అయింది. ఈ ఏడాది 66.77 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా.. 153 లక్షల టన్నుల వరిపంట ఉత్పత్తి జరిగింది.