Rocking Star Yash: మూడు పండుగల స్పెషల్‌గా రాబోతున్న స్టార్ హీరో సినిమా.. ఆనందంలో ఫ్యాన్స్

by sudharani |
Rocking Star Yash: మూడు పండుగల స్పెషల్‌గా రాబోతున్న స్టార్ హీరో సినిమా.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్ (Rocking Star Yash) లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action entertainer) ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్‌’ (Toxic: A Fairy Tale for Grown-Ups). ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌కు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన మేకర్ గీతు మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా (Pan India) చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో టాక్సిక్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రాజెక్ట్‌‌గా టాక్సిక్ ప్రపంచ వ్యాప్తంగా (హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లోకీ) రిలీజ్ కాబోతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌(Release date)ను ప్రకటించారు చిత్ర బృందం. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేయబోతోన్నట్టుగా తెలిపారు. ఉగాది, గుడి పడ్వా, ఈద్ సందర్భంగా ‘టాక్సిక్’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ.. రాకింగ్ స్టార్ యష్ అద్భుతమైన పోస్టర్‌(Excellent poster)ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో కనిపించే మంటలు, చుట్టూ ఉన్న పొగ, హీరోని చూపించిన తీరు, ఆ గన్‌ను పట్టుకున్న విధానం, హీరో పెట్టుకున్న టోపీ ఇలా అన్నీ కూడా ఎంతో స్టైలీష్‌గా ఉన్నాయి. యష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ (Glimpses) నేషనల్ (National), ఇంటర్నేషనల్‌ (International)వైడ్‌గా ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. కాగా.. మూడు పండుగల నడుమ ‘టాక్సిక్’ రిలీజ్ కాబోతున్న విషయం తెలియడంతో సినీ ప్రియులతో పాటు యష్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story