- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి

దిశ, నారాయణ పేట ప్రతినిధి: క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా.. కలెక్టరేట్ లోని వీసీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షయ నారాయణ పేటను వ్యాధి రహిత జిల్లాగా మార్చడానికి మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 14,707 పరీక్షలు నిర్వహించగా.. 903 కేసులు నమోదు కాగా వాటిలో 185 టార్గెట్ ఉన్నాయన్నారు. అందులో 183 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. టీబీ వ్యాధిని అంతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు.
అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అంబలి ఏర్పాటు చేయడం పట్ల రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణికి వచ్చే ప్రజలు, మిగతా వాళ్ళు అందరూ వేసవిలో చల్లదనానికి అంబలి తాగాలని ఆమె తెలిపారు. కలెక్టరేట్ ఏవో జయసుధ, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కె. సుదర్శన్ రెడ్డి, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు ఆత్మారాం ఏడ్కే, కన్న జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
టిజి ఆర్ఎస్ ఏ 2025 నూతన డైరీ ఆవిష్కరణ
టిజిఆర్ ఎస్ఏ 2025 నూతన డైరీని సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షులు చింతా రవి, సభ్యులు శ్రీకాంత్, రామకృష్ణ, బాలరాజు, రాణి దేవి,, అజహర్, చైతన్య, మహేష్ మల్లప్ప పాల్గొన్నారు.
పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షా సరళిని ఆమె పరిశీలించారు కేంద్రంలో విద్యార్థుల హాజరు శాతం గురించి సీఎస్ ను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని ఓ గదిలో బియ్యం బస్తాలు నిల్వ చేసిన స్థలంలోనే పెయింటింగ్ (కలర్) డబ్బాలు ఉండటం గమనించిన కలెక్టర్ వెంటనే వాటిని అక్కడి నుంచి తీసి వేయాలని ఆదేశించారు.