రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన.. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్

by Ramesh Goud |   ( Updated:2025-03-22 15:36:51.0  )
రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన.. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
X

దిశ, వెబ్ డెస్క్: రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి (Agriculture Minister)చేసిన ప్రకటన పట్ల అసహనం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) అసెంబ్లీ నుంచి వాకౌట్ (Walk Out) చేశారు. తెలంగాణలో శాసనసభ సమావేశాలు (Telangana Assembly Session) హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సభలో అధికార, ప్రతిపక్షాల నడుమ మాటల యుద్దం నడుస్తోంది. బడ్జెట్ (Budget) పద్దులపై చర్చ సందర్భంగా ఒకరి మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రసంగిస్తుండగా.. విపక్ష బీఆర్ఎస్ నేతలు మధ్యలోనే వాకౌట్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేసిన రూ.2 లక్షల రుణమాఫీ పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు (Agriculture Minister thummala Nageswar Rao) మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, ఆ పైన ఉన్నవాటికి లేదని ప్రకటించారు. అంతేగాక ఇప్పటివరకు రూ.2 లక్షల లోపు రుణం (Loan) ఉన్న రైతుల కుటుంబాలు (Farmers Families) 25 లక్షలు ఉన్నట్లుగా తమ వద్దకు జాబితా (List) వచ్చిందని, వాటికి 20,616 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి స్పష్టం చేశారు. రుణమాఫీ పూర్తి అయ్యిందన్న మంత్రి తుమ్మల నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి చేసిన ప్రకటనలో వాస్తవం లేదని, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి, వెళ్లిపోయారు.

Next Story