ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. డ్యూయల్ రోల్‌తో బన్నీ ఎంట్రీ.. పారితోషికం తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే?

by Anjali |
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. డ్యూయల్ రోల్‌తో బన్నీ ఎంట్రీ.. పారితోషికం తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటుడు ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. గంగోత్రి, ఆర్య, పరుగు వంటి చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించిన బన్నీ.. ఎవడు, డీజే, ఇద్దరమ్మాయిలతో, అల వైకుంఠపురంలో, పుష్ప వంటి చిత్రాలతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన పుష్ప మూడో భాగం కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు మరో భారీ శుభవార్త అందింది.

పాన్ ఇండియా స్థాయిలో బన్నీ అండ్ అట్లీ (Atlee) కలయికలో బిగ్ ప్రాజెక్టు తెరకెక్కుతోందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అట్లీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న మూవీలో అల్లు అర్జున్ డ్యూయల్ పాత్రలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. విలన్‌గా అండ్ హీరోగా కనిపించబోతున్నా. నెగిటివ్ రోల్‌లో బన్నీని చూసేందుకు అభిమానుల ఆత్రుత మామూలుగా లేదని చెప్పుకోవచ్చు.

మరీ అల్లు అర్జున్ ఈ మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలిస్తే జనాలు నిజంగా షాక్ అవుతారు. అట్లీ రూ. 100 కోట్లు అనగా.. కానీ బన్నీ మాత్రం రూ. 175 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమూ తెలియదు కానీ నెట్టింట బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా రావాల్సి ఉండేనట. కానీ ఈ మూవీ క్యాన్సిల్ అయ్యిందట.

Next Story