- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వ్యవసాయ భూముల్లో వెంచర్..!
దిశ, అల్వాల్ : వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్నాయి. నాలా కన్వర్షన్ తీసుకోకుండానే రియల్ ఏస్టేట్ వ్యాపారులు అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి ఆకర్షణీయంగా బ్రోచర్లు ముద్రించి, పాత అనుమతులు ఉన్నాయంటూ నమ్మబలికి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ వ్యవహారం పై క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్వాల్ సర్కిల్ రియల్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు, ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వ్యవసాయ భూమిలో వెంచర్...
అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ వెంకటేశ్వర కాలనీ ఆనుకొని మోతుకుల కుంట చెరువు ఉంది. చెరువు కింది భాగంలో సర్వేనెంబర్ 143, 144, 145 లలో ఓ వెంచర్ వెలుస్తోంది. అయితే వెంచర్ నిర్వహకులు ఇప్పటికే నాలా కన్వర్షన్ తీసుకోలేదని సమాచారం. ఆయా సర్వే నెంబర్లలో ఉన్న భూమి ధరణి పోర్టల్ ఇప్పటికే వ్యవసాయ భూములుగానే దర్శనమిస్తున్నాయి. కానీ వెంచర్ నిర్వాహకులు తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతుండడం గమనార్హం. అయితే ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూములని చూపిస్తుండడం, నాలా కన్వర్షన్ కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే వెంచర్ నిర్వహకులు నాలా కన్వర్షన్ చేసుకొని, వెంచర్ కు అనుమతులు తీసుకుని ఉంటే ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూములని దర్శనమివ్వడం పై ప్లాట్ల కొనుగోలు దారుల్లో అయోమయం నెలకొంది. కాగా ఇప్పటికే ఈ వెంచర్ లో ప్లాట్లను కొనుగోలు చేసిన అనుమానాలను ఇటు వెంచర్ నిర్వహకులు లేదా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నివృత్తి చేయాల్సిన అసవరం ఎంతైనా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
నోటీసులతో హైరానా..
అల్వాల్ సర్కిల్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు ఇప్పటికే హైడ్రా పీవర్ పట్టుకుంది. 30 ఏళ్ల క్రితం ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకొని నివాసాలు ఉంటున్న ఆనంద్ నగర్ కాలనీవాసులకు ప్రభుత్వ యంత్రాంగం ఇటీవలే ఝలక్ ఇచ్చింది. ఎప్టీఎల్, బఫర్ జోన్లలో నివాసం ఉంటున్నారంటూ కాలనీవాసులకు నోటీసులు ఇచ్చి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నాలా కన్వర్షన్ లేకుండా, అనుమతులు తీసుకోకుండా వేసిన వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. తక్షణమే జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు మోతుకుల కుంట చెరువు కింద వెంకటేశ్వర కాలనీకి ఆనుకొని వెలిసిన వెంచర్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అనుమతులు ఉన్నాయా..? నాలా కన్వర్షన్ జరిగిందా..? అని పరిశీలించాలని, ఒకవేళ లేకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.