KTR: కేటీఆర్‌కు అరుదైన గౌరవం.. అతిపెద్ద ఈవెంట్‌కు గెస్ట్‌గా రావాలని ఆహ్వానం

by Gantepaka Srikanth |
KTR: కేటీఆర్‌కు అరుదైన గౌరవం.. అతిపెద్ద ఈవెంట్‌కు గెస్ట్‌గా రావాలని ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు అరుదైన గౌరవం దక్కింది. కేరళ(Kerala) రాష్ట్రంలోనే అతిపెద్ద ఈవెంట్‌గా పేరున్న 13వ టైకాన్‌కు గౌరవ అతిథిగా ఆహ్వానించారు. ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్(TiE) ఆధ్వర్యంలో డిసెంబర్ 4, 5, 2024 తేదీల్లో కోచిన్‌లోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతుంది. ఈ టైకాన్‌కు వివిధ రంగాల సీఈఓలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణుల వంటి 1,000 మందికి పైగా పాల్గొననున్నారు. ఈ ఏడాది థీమ్, "మిషన్ 2030 - ట్రాన్స్‌ఫార్మింగ్ కేరళ," కేరళ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించేందుకు అవసరమైన ప్రణాళికలను వ్యూహాలను ఈ సదస్సు చర్చించనున్నది.

Advertisement

Next Story

Most Viewed