Breaking: చెన్నైకు నటి కస్తూరి తరలింపు..

by Rani Yarlagadda |
Breaking: చెన్నైకు నటి కస్తూరి తరలింపు..
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ రాజకీయపార్టీ సభలో నటి కస్తూరి (Actress Kasturi) తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నిన్న చెన్నై పోలీసులు (Chennai Police) ఆమెను సైబరాబాద్ (Cyberabad) పరిధిలోని రాజేంద్రనగర్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెను సైబరాబాద్ నుంచి చెన్నైకి తరలించారు. అరెస్టు భయంతో.. కస్తూరి ముందస్తు బెయిల్ (Anticipatory Bail) కోసం మూడ్రోజుల క్రితం మద్రాస్ హై కోర్టును (Madras High Court) ఆశ్రయించింది. కానీ ఆమెకు బెయిల్ నిరాకరించింది కోర్టు. తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు నుంచి తప్పించుకునేందుకు కస్తూరి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఆఖరికి అరెస్టు కాక తప్పలేదు. మరోవైపు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తగిన శిక్ష విధించాలని తెలుగు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed