- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సునితా విలియమ్స్ రాక ఎందుకు ఆలస్యం?

- క్రూ 10 మిషన్ ఆగిపోవడం వెనుక కారణం ఏంటి?
- సునీత రాక మళ్లెప్పుడు?
దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) కి వెళ్లిన నాసా వ్యోమగాములు సునితా విలియమ్స్, బచ్ విల్మోర్ తిరిగి భూమిపైకి రావడానికి మరింత ఆలస్యం కానుంది. తొమ్మిది నెలల క్రితం ఐఎస్ఎస్‌కు వెళ్లిన ఇద్దరు నాసా వ్యోమగాములు అక్కడే చిక్కుకొని పోయారు. అయితే వీరిద్దరినీ వెంటనే భూమిపైకి తీసుకొని రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఇందుకోసం స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను కూడా ఆయన ఇన్వాల్స్ చేశారు. దీంతో ఇద్దరు నాసా వ్యోమగాములను భూమిపైకి తీసుకొని రావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. వాస్తవానికి స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక కొందరిని ఐఎస్ఎస్‌కు తీసుకొని వెళ్లి.. తిరుగు ప్రయాణంలో సునితా, బచ్ విల్మర్‌లను తీసుకొని రావాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రయోగం మార్చ్ 25న నిర్వహించాల్సి ఉండగా.. దాన్ని ప్రీ షెడ్యూల్ చేసి మార్చి 13నే చేపట్టాలని అనుకున్నారు. ఈ మేరకు కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం 39ఏ కాంప్లెక్స్ నుంచి రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ కూడా ప్రారంభమైన తర్వాత చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
స్పేస్ ఎక్స్ 10 క్రూ ప్రయోగం చివరి నిమిషంలో ఆగిపోవడంతో దీన్ని రీలాంఛ్ చేయడానికి స్పేస్ ఎక్స్ తిరిగి ప్రయత్నాలు ప్రారంభించింది.అయితే అనుకున్న సమయానికి ప్రయోగం విఫలం కావడంతో ఐఎస్ఎస్‌లో ఉన్న సునితా, విల్మోర్‌ల రాక మరింత ఆలస్యం కానున్నట్లు నాసా ప్రకటించిది. అయితే వీరు త్వరలోనే తిరిగి భూమిపైకి రానున్నట్లు నాసా ఆశాభావం వక్తం చేసింది.