- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి
దిశ,పెద్దపల్లి : జిల్లాలోని రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం, ఎన్సీడీ సర్వే, డయాగ్నొస్టిక్ హబ్, పాలాటివ్ కేర్, టీబి నియంత్రణ వంటి పలు అంశాలపై జిల్లా కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ద్వారా గర్భిణి మహిళలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అన్నారు. 102 అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణి మహిళలను రెగ్యులర్ గా చెకప్ కోసం ఆసుపత్రికి ముందస్తుగా తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలో ఎన్సీడీ సర్వే వివరాలు బాగా జరుగుతున్నాయని, ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, అవసరమైన వారికి మందులు అందేలా చూడాలన్నారు. గ్రామాలలో ఉన్న ఎంఎల్హెచ్పీలు, ఎన్సీడీ సర్వే తీరును పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలోనే రోగులకు డయాగ్నస్టిక్ హబ్, వైద్య పరీక్షలు నిర్వహించి తొలి ఫలితాలు అందించడంలో పెద్దపెల్లి జిల్లా మొదటి స్థానంలో ఉందని, దీనికి కృషి చేసిన అధికారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. డయాగ్నస్టిక్ హబ్ ద్వారా ప్రస్తుతం 6 గంటల వ్యవధిలో మనం ఫలితాలు అందిస్తున్నామని, దీనిని 4 గంటలకు తగ్గించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.
పరీక్ష నమూనాలు టీ-హబ్ కు త్వరగా చేరుకునేలా రవాణా వ్యవస్థ రీ ఆర్గనైజ్ చేసుకోవాలని తెలిపారు. జిల్లా ఆస్పత్రులలో పాలేటివ్ కేర్ కింద అవసరమైన వారికి ఇన్ పేషెంట్ సేవలు అందించాలని అన్నారు. టీబీ కేసుల నియంత్రణ అంశంలో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే చికిత్స ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.