BRS: తెలంగాణలో కేవలం రెండు పార్టీలే.. బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

by Ramesh Goud |
BRS: తెలంగాణలో కేవలం రెండు పార్టీలే.. బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కేవలం రెండు పార్టీలే ఉన్నాయని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్(Congress) కు ఐదు సీట్లు కూడా రావని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి(BRS Leader Patlolla Karthik Reddy) అన్నారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్(KCRBRS) తయారు చేసిన సైనికులని, కేటీఆర్(KTRBRS) ను అరెస్ట్ చేస్తే మనం నీరసపడిపోతామని అంచనా వేస్తున్నారని, కానీ, రామన్నను అరెస్ట్ చేస్తే ఎట్లయితది అనే విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెలుసుకోవాలన్నారు.

అలాగే కేసీఆర్ ను వదిలేసి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజకీయ సమాధి కట్టుకన్నట్టేనని, కేసీఆర్ లేకపోతే వార్డ్ మెంబర్ గా కూడా గెలవరని, రాజేంద్రనగర్, శేరి లింగంపల్లి, పటాన్ చెరు, చేవెళ్ల ఎమ్మెల్యేలు సొంత శక్తితో గెలిచిన వాళ్లు కాదని వ్యాఖ్యానించారు. అంతేగాక గత పదేళ్ల నుంచి జెండా కూలీలుగా మారిన కాంగ్రెస్ కార్యకర్తలను చూస్తే బాధేస్తుందని, ముఖ్యమంత్రి వేరే పార్టీ నుండి వచ్చిన వ్యక్తేనని, ప్రస్తుతం గ్రామాల్లో పదవులు తెచ్చుకుంటున్నది కూడా పదేండ్లు అధికారం ఎంజాయ్ చేసినవాళ్లేనని చెప్పారు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ , యాంటీ కేసీఆర్ పార్టీ అనే రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని, కేసీఆర్ కు సంబంధించిన వాళ్లు బీజేపీలో కూడా ఉన్నారని, కాంగ్రెస్ లో కూడా కేసీఆర్ వర్గం ఉందని కార్తీక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed