Sama Ram Mohan : ఇంతకీ యోగ ప్రాక్టీస్ చేస్తున్నావా? కేటీఆర్‌పై సామ రామ్మోహన్ రెడ్డి సెటైర్లు

by Ramesh N |
Sama Ram Mohan : ఇంతకీ యోగ ప్రాక్టీస్ చేస్తున్నావా? కేటీఆర్‌పై సామ రామ్మోహన్ రెడ్డి సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంతకీ యోగ ప్రాక్టీస్ చేస్తున్నావా? అంటూ (TPCC) టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy) మాజీ మంత్రి (KTR) కేటీఆర్‌‌పై సెటైర్లు వేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘పదేళ్లలో మూసీల మరింత విషం నింపి రోగాలకు కేరాఫ్ అడ్రస్ చేసినోడు.. దొరికినకాడికి మూసీని కబ్జాలు చేసిన బీఆర్ఎస్ దొంగలను కాపాడినోడు, నోట్లో నుంచి మూసీ శుద్ధి తప్ప చెయ్యాలనే బుద్ధి లేనోడు.. మూసీ గురించి మాట్లాడబట్టే. గాంధీ విగ్రహం పెడుతారంటేనే కడుపులో అక్కసు కక్కే నీలాంటి విష నాగులే అసలైన గాడ్సే వారసులు కేటీఆర్, నువ్వు నీ అయ్య ఏనాడూ గాంధీజీని అనుసరించిందీ లేదు. బతికుంటే మూసీ ప్రక్షాళనకు గాంధీజీ నేడు ముందుంటుండే’ అని పేర్కొన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని కొల్లగొట్టి.. నాడు దేశాన్ని కొల్లగొట్టిన తెల్ల దొరలను తలపించిన బందిపోటు ముఠా మీరని విమర్శించారు. మీ నోటి నుంచి గాంధీజీ పేరు పలికినా ఆయన ఆత్మ చింతిస్తుందని తెలిపారు. 1100 కోట్లకే మూసీ పునరుజ్జీవం చేసేటట్టుంటే పదేళ్లు నువ్వు నీ అయ్య ఏం చేశారు? నువ్వు నీ బక్వాస్ మాటలు.. అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

‘పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పువ్వు పార్టీకి తొత్తు వై ప్రచారానికి కూడా పోనీ నువ్వు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటంటే ప్రజలు నిన్ను పిచ్చోడు అంటున్నారు. నువ్వు ఈడ గల్లీలల్ల బీజేపీ మీద 'డైలాగులు' కొట్టుడు.. డిల్లీకి పోయి వారి కాళ్ళ మీద 'డైవులు' కొట్టుడు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కేటీఆర్.. కాళ్ళు మొక్కే ఫోటో బయటికి వస్తే ఇజ్జత్ పోతదని మంత్రుల చాంబర్ లోపలికి ఫోటోగ్రాఫర్‌ని కూడా పట్టుకుపోలేదంటగా? తెలంగాణ ప్రజల మీద నీ నక్క ప్రేమ ఆపితే మంచిది’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story