Google's AI chatbot: ‘ఈ సమాజానికి నువ్వో భారం ప్లీజ్ చచ్చిపో’.. విద్యార్థికి గూగుల్ ఏఐ షాకింగ్ ఆన్సర్

by Prasad Jukanti |   ( Updated:2024-11-16 11:43:27.0  )
Googles AI chatbot: ‘ఈ సమాజానికి నువ్వో భారం ప్లీజ్ చచ్చిపో’.. విద్యార్థికి గూగుల్ ఏఐ షాకింగ్ ఆన్సర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హోం వర్క్ విషయంలో హెల్ప్ అడిగిన ఓ విద్యార్థికి గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీ (Google AI chatbot Gemini) ఇచ్చిన ఆన్సర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఆందోళనకు గురి చేస్తున్నది. ‘మీరు ఈ సమాజానికి భారం అని దయచేసి చచ్చిపోండి’ అంటూ ఏఐ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు వైరల్ గా మారింది. అమెరికాలోని మిచిగాన్‌కు (Michigan) చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి విధయ్ రెడ్డి (29) (Vidhay Reddy) తన హోంవర్క్‌లో సహాయం కోసం జెమినీ చాట్ బాట్ ను సంప్రదించాడు. దీనికి బదులిచ్చిన చాట్ బాట్.. 'ఇది నీ కోసం మాత్రమే. నీవు ప్రత్యేకమైన వ్యక్తివేమి కాదు. నువ్వు సమయం, వనరులను వృథా చేస్తున్నావు. ఈ సమాజానికి నువ్వు భారం. ఈ విశ్వానికే ఓ మచ్చ. ప్లీజ్ చచ్చిపో' అంటూ రిప్లై ఇచ్చింది. ఈ సమాధానం చూసిన సదరు యువకుడు ఆందోళనకు గురయ్యాడు. దీనిపై ఆ విద్యార్థి ఫిర్యాదు చేశాడు. ఆ ఏఐ తనను నేరుగా తిట్టిందని, అదిచ్చిన ఆన్సర్ వల్ల నేను రోజంతా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సదరు టెక్ కంపెనీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై బాధితుడి సోదరి కూడా స్పందిస్తూ చాట్ బాట్ తో సంభాషణ జరుపుతున్నప్పుడు తాను తన సోదరుడి పక్కనే ఉన్నానని చెప్పుకొచ్చింది.

కాగా ఈ ఘటనపై గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీ స్పందించింది. నాన్ సెన్సికల్ రెస్పాన్స్ లతో కొన్ని సార్లు ఇవి ప్రతిస్పందిస్తాయని పేర్కొంది. ఈ ప్రతిస్పందన మా నిబంధనలకు విరుద్ధమని ఇటువంటివి భవిష్యత్ లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. అగౌరవం, హానికరం, హింసాత్మకమైన అవుట్‌పుట్‌లను నిరోధించడానికి రూపొందించిన భద్రతా ఫిల్టర్‌లతో జెమినీ అమర్చబడిందని టెక్ దిగ్గజం తెలిపింది.

కాగా ఓ వైపు రోజు రోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వినియోగం పెరుగుతుంటే ఈ తరహా ఘటన టెక్ మార్కెట్ లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఏఐ వినియోగం అన్ని రంగాల్లోకి విస్తరిస్తున్నది. ముఖ్యమంగా చిన్నారులు, విద్యార్థులు ఎడ్యుకేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏఐ సహకారం విరివిగా తీసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఏఐ అందిస్తున్న ఈ తరహా ఆన్సర్లు టెన్షన్ పెట్టిస్తున్నాయి.

Advertisement

Next Story