- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వీధి కుక్క స్వైర విహారం..చిన్నారిపై దాడి
దిశ ,శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్న..సంబంధిత అధికారులు, సిబ్బంది చోద్యం చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..మైలార్దేవుపల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలిపురం ప్రాంతానికి చెందిన రఫీ, హైసా దంపతులు కూతురు గులాబ్షా శుక్రవారం పాఠశాలకు వెళ్లి..తిరిగి ఇంటికి వచ్చి ఇంటి ముందు ఆడుకుంటుండగా అక్కడే గుంపులుగా ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారి గులాబ్షాపై దాడి చేశాయి. ఈ దాడిలో పాపకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు పేర్కొన్నారు. హుటాహుటిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. బస్తీలలో వీధి కుక్కల స్వైర విహారం అధికమైందని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇకనైనా అధికారులు స్పందించి..వీధి కుక్కల సమస్య నుంచి తమకు విముక్తి కల్పించాలని డివిజన్ వాసులు కోరుతున్నారు.