Teja sajja: అందరికి మంచి బ్రేక్‌ ఇవ్వాలి.. నూతన టాలెంట్‌పై తేజా సజ్జ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-11-16 14:19:59.0  )
Teja sajja: అందరికి మంచి బ్రేక్‌ ఇవ్వాలి.. నూతన టాలెంట్‌పై తేజా సజ్జ  కామెంట్స్
X

దిశ, సినిమా: యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ (Beckem Venugopal).. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’ (Roti Kapada Romance). విక్రమ్ రెడ్డి (Vikram Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్ (Prerelease Event)ను తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు.. దర్శకులు యదు వంశీ, పవన్‌ సాధినేని, హర్ష, రచయిత కోనవెంకట్‌, నిర్మాతలు కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌, చదల వాడ శ్రీనివాసరావు, తుమ్మల పల్లి రామసత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తేజా సజ్జ (Tejasajja) మాట్లాడుతూ.. ‘ఈ వేదిక మీద ఉన్న నూతన టాలెంట్‌కు ఈ సినిమా ఎన్నో ఏళ్ల కల. ఈ చిత్రంతో నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ ఎంతో మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాడు. ఆయన్ని చూస్తే ఎంతో ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు తీసిన 14 సినిమాల్లో ఎంతో మంది దర్శకులను, రచయితలను, నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇక రోటి కపడా రొమాన్స్‌తో ఈ నవంబర్ 22న చాలా మంది నూతన నటీనటులు పుట్టబోతున్నారు. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధించి, అందరికి మంచి బ్రేక్‌ నివ్వాలి. తప్పకుండా అందరూ థియేటర్‌లో ఈ సినిమా చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

Read More...

Teja Sajja: ఐఫా కాంట్రవర్సీ.. ఫైనల్లీ స్పందించిన తేజా సజ్జ.. ఏమన్నాడంటే?


Advertisement

Next Story