Cinematica Expo 2: ఘనంగా స్టార్ట్ అయిన సినిమాటికా ఎక్స్‌పో 2.. డైరెక్టర్స్ ఆర్జీవీ, సందీప్ రెడ్డి కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2024-11-16 14:16:35.0  )
Cinematica Expo 2: ఘనంగా స్టార్ట్ అయిన సినిమాటికా ఎక్స్‌పో 2.. డైరెక్టర్స్ ఆర్జీవీ, సందీప్ రెడ్డి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ఇండియాజాయ్ అండ్ సినిమాటికా ఎక్స్‌పో (Indiajoy and Cinematica Expo) మరోసారి అలరించడానికి సిద్దమైంది. ఈ సినిమాటికా ఎక్స్‌పో ప్రపంచ ప్రఖ్యాత యానిమేషన్ (animation), విఎఫ్‌ఎక్స్ (VFX), గేమింగ్‌ (gaming) రంగాలకు సంబంధించిన టెక్నాలజీ, టెక్నీషియన్స్‌ను ఒకటే చోటికి చేర్చి సందర్శకులకు పరిచయం చేస్తోంది. గతేడాది ఆవిష్కరించిన అంతర్జాతీయ ప్రదర్శన (International Exhibition)కు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సహా పలువురు ప్రముఖుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ఈ ఏడాది సినిమాటికా ఎక్స్‌పో 2వ ఎడిషన్‌ను నవంబర్ 16, 17 తేదీలలో హెచ్ఐసిసి నోవోటెల్ (HICC Novotel)లో నిర్వహిస్తున్నారు. సినీరంగానికి చెందిన యువ దర్శక నిర్మాతలు, విద్యార్థులు, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ ఇండస్ట్రీకి చెందిన వారు ఈ ఈవెంట్‌కు హాజరుకావడం వల్ల ఎన్నో నూతన విషయాలపై అవగాహన కలుగుతుంది. ఈ ఎక్స్‌పోకు దాదాపు 30వేల మంది హాజరవ్వడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇక నేడు ఘనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాంగోపాల్ వర్మ (Ramgopal Varma), సందీప్ రెడ్డి వంగా, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ (Director RGV) మాట్లాడుతూ.. ‘ముందుగా ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు. నేను మొదలు పెట్టినప్పుడు సినిమా వేరు ప్రస్తుతం సినిమా వేరు. సినిమాకి సంబంధించిన విజువల్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మారుతూ వచ్చాయి. సెంథిల్ చెప్పినట్టు ఇండియన్ సినిమా పెద్ద హైట్స్ చూస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు కొత్తదనంతో ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ సినిమాటిక ఎక్స్‌పో సినిమా మీద పాషన్‌తో వచ్చే ఎంతోమందికి ఒక మంచి వర్క్ షాప్ లాంటిది. ఇది ఇంత గ్రాండ్ స్కేల్లో ఆర్గనైజ్ చేస్తున్న టీమ్‌కు అభినందనలు’ అని తెలిపారు.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) మాట్లాడుతూ.. ‘నేను ఈ ఈవెంట్‌కి కేవలం ఆర్జీవి కోసమే వచ్చాను. కానీ ఈవెంట్ ఇంత గ్రాండ్‌గా ఉంటుంది అనుకోలేదు. ఈ సినిమాటికా ఎక్స్‌పో 2వ ఎడిషన్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ (Cinematographer Senthil Kumar) మాట్లాడుతూ.. ‘ఈ సినిమాటిక ఎక్స్‌పో ప్లాట్‌ఫామ్ ఎంతోమందికి ఇన్నోవేటివ్‌గా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఫ్యూచర్‌లో సినిమాని ఇంకా గ్రాండ్‌గా తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఈవెంట్‌కి ఆర్జీవి, సందీప్ రెడ్డి వంగా రావడం చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా ఈవెంట్‌ని అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

Read More...

RGV : నోటీసులపై ఆర్జీవీ స్పందన ఇదే!





Advertisement

Next Story

Most Viewed