- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురుకులాల వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: గురుకులాల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం గురుకులాల బాట పట్టింది. విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలను 40 శాతం పెంచింది. విద్యార్థులకు అందించే ఆహార మెనూలోనూ కీలక మార్పులు చేసింది. తప్పుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఏ పొరపాటు జరగకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. గురుకులాల సెక్రెటరీలు సైతం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.
గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు
గురుకులాలకు సప్లై చేసే కూరగాయలు, ఇతర సరుకుల బిల్లులు, మెస్ చార్జీలను త్వరితగతిన చెల్లించేలా ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే, నాసిరకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లు, వాటిని అప్రూవల్ చేసిన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో 2004-14 మధ్య గ్రీన్ ఛానల్ మెస్ ఛార్జీలు ఉండేవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పూర్తిగా రద్దు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను పునరుద్ధరించింది. మెస్ చార్జీలు, భవనాల అద్దెలు ప్రతి నెల పదో తేదీ లోపు గ్రీన్ గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించనున్నారు.
పౌష్టికాహారానికి ప్రత్యేక వ్యవస్థ
ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు జరగకుండా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. తప్పు జరిగితే అధికారులే బాధ్యత వహించేలా మార్పులు తీసుకొచ్చారు. కామన్ డైట్ మెనూ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారు. పెంచిన డైట్ చార్జీలు డిసెంబర్ 14 నుంచి అమల్లోకి రావడంతో ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. అంతేకాకుండా, మెనూ లో కూడా కీలక మార్పులు చేశారు. కామన్ డైట్ మెనూ, స్టాండర్డైజేషన్ ఆఫ్ స్టోరేజ్, కిచెన్ డైనింగ్ ఏరియా మెయింటెనెన్స్ ద్వారా సమస్యలకు చెక్ పెట్టేలా మార్పులు చేశారు. నెలలో రెండు సార్లు మటన్, నాలుగుసార్లు చికెన్, గుడ్డుతో పాటు టమాట రైస్, పప్పు,పెరుగు, బగార రైస్, స్నాక్స్ కు మిల్లెట్ బిస్కెట్స్, బాయిల్డ్ పెసర్లు, ఫ్రైడ్ పల్లి, బెల్లం, బాయిల్డ్ బఠాణీ, బాయిల్డ్ బొబ్బర్లు, ఎగ్ బజ్జీ, ఇవే కాకుండా బ్రేక్ ఫాస్ట్ లో కూడా పలు మార్పులు చేసి నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. అంతేకాకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందుతుందో లేదో చూసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.
సొంత భవనాల నిర్మాణం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలకు అద్దె భవనాల్లోనే కొనసాగించింది. దీనివల్ల సకాలంలో ఓనర్లకు బిల్లులు చెల్లించక, ఆ బిల్డింగుల ఓనర్లు భవనాలకు తాళాలు వేసి వెళ్లిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 216 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 327 బీసీ గురుకులాలు ఉంటే, 21 గురుకులాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 306 గురుకులాలకు సొంత భవనాలు లేవు. ఒక్క బీసీలోనే కాదు.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలదీ ఇదే పరిస్థితి. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ముందుచూపుతో విశాలమైన క్రీడా మైదానాలు ఉండేలా 250 స్కూల్స్ ను, 25 ఎకరాల స్థలంలో 150 నుంచి 200 ఖర్చుతో ఇంటిగ్రేట్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
రూ. 667 కోట్ల నిధులు విడుదల..
వంట గదులు, ఎలక్ట్రిసిటీ, బాత్రూమ్ లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 667 కోట్లను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు సైతం కచ్చితంగా నెలలో ఎన్ని గురుకులాలను సందర్శించారు? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే నివేదికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉపాధ్యాయులను సైతం నియమించింది. వారు 8 లక్షల మంది పిల్లలకు మార్గదర్శకత్వం చేయనున్నారు. వారు వృత్తిని సగర్వంగా, నిబద్ధతో నిర్వహిస్తే బలహీన వర్గాల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు మంచి భవిష్యత్తును అందించిన వారవుతారు. అప్పుడే ప్రభుత్వ సంకల్పం కూడా నెరవేరుతుంది.