నియంత అనుకంటున్నవా?.. సీఎం రేవంత్‌పై KA పాల్ ఫైర్

by Gantepaka Srikanth |
నియంత అనుకంటున్నవా?.. సీఎం రేవంత్‌పై KA పాల్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 422 బిల్డింగులు అక్రమంగా కూల్చారు.. సీఎం సోదరుడి బిల్డింగును ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని చెప్పారు. కలిసి పనిచేద్దాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని సూచించారు. మరో రెండేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలు(Jamili Elections) రావడం ఖాయమని అన్నారు.

ఇదిలా ఉండగా.. గతంలో సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి(Tirupati Reddy) ఇంటికి ‘హైడ్రా’(Hydra) అధికారులు నోటీసులు అంటించారు. మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఆయన నివాసముంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో హైడ్రా అధికారులు పేర్కొన్నారు. దీనిపై ఇవాళ కేఏ పాల్ స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed