Revanth Reddy: మాజీ ప్రధాని పీవీ కి ముఖ్యమంత్రి ఘన నివాళులు

by Ramesh Goud |   ( Updated:2024-12-23 14:25:46.0  )
Revanth Reddy: మాజీ ప్రధాని పీవీ కి ముఖ్యమంత్రి ఘన నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశ మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహారావు(Former Prime Minister PV Narasimha Rao) వర్ధంతి(Death Anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఘన నివాళులు(Paid Tributes) అర్పించారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) లోని సీఎం నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి పీవీ చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy), మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి(Former MP Ranjith Reddy), తదితరులు పీవీ నరసింహారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. కాగా వరంగల్ జిల్లాకు చెందిన పీవీ ఈ దేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ఆయన దేశ ఆర్థిక మంత్రిగా పని చేసిన సమయంలో ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడాడు. ఇవాళ ఆయన వర్థంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.


Read More..

ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశం ప్రపంచంతో పోటీ పడేలా కృషి చేశారు : మంత్రి పొన్నం

Advertisement

Next Story