- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health : ఈ విటమిన్ లోపమే పురుషుల్లో ఆ సమస్యలకు కారణం..? ఎలా భర్తీ చేయాలంటే..
దిశ, ఫీచర్స్ : సీజన్లతో సంబంధం లేకుండా నిద్రలేమి వెంటాడుతోందా?, ఎలాంటి పని చేయకపోయినా తీవ్రమైన అలసట వేధిస్తోందా? అయితే మీ శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపం ఇందుకు కారణం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా విటమిన్ బి12 లోపిస్తే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. నీరసం, బద్ధకం, బలహీనత ఆవహిస్తాయి. నిపుణుల ప్రకారం ఇంకా ఏయే సమస్యలు తలెత్తుతాయి? ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మానవ శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో బి12 ఒకటి. ఇది లోపిస్తే ఎర్ర రక్త కణాల పనితీరు మందగిస్తుందని, నరాలు బలహీన పడే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 2003లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది విటమిన్- ఎ లోపాన్ని ఎదుర్కొంటుండగా, మూడింట ఒకవంతు మంది పురుషులు విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. ఫలితంగా యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి ఇబ్బందులు కూడా కొందరిలో తలెత్తుతున్నాయి.
కారణం : విటమిన్ బి12 లోపానికి ప్రధాన కారణం సరైన పోషకాహారం తీసుకోకపోవడమే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా శాఖాహారుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. 2024లో నిర్వహించిన ఒక స్టడీ ప్రకారం.. 50 శాతం మంది శాఖాహారుల్లో విటమిన్ బి12 లోపం ఉంటోంది. ఈ లోపాన్ని అధిగమించాలంటే.. పాలు, గుడ్లు, ఆకుకూరలు వంటివి అధికంగా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
లక్షణాలు : విటమిన్ బి12 లోపించిన వారిలో నిరంతరం అలసట, బలహీనత, చేతులు, కాళ్లల్లో తిమ్మిరి, జలదరింపు, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కామెర్లు లేదా స్కిన్ ఎల్లో కలర్‌లోకి మారడం వంటివి కనిపిస్తాయి.
పరిష్కారం : ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకోసం మాంసాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక శాఖాహారాలు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా గుడ్లు, పాలు, చీజ్, పెరుగు, నెయ్యి వంటివి తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు. అవసరాన్ని బట్టి వైద్య నిపుణులు సూచన మేరకు విటమిన్ బి12 సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.