Indian Cricketer: టీమిండియా మాజీ క్రికెటర్‌ పరిస్థితి విషమం

by Gantepaka Srikanth |
Indian Cricketer: టీమిండియా మాజీ క్రికెటర్‌ పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. కాంబ్లీ వైద్యానికి సహకరిస్తున్నప్పటికీ.. పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆయన్ను కలిసిన స్నేహితులు ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేశారు.


ఆసుపత్రి బెడ్‌పై కాంబ్లీ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు కాంబ్లీ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌‌(Sachin Tendulkar)కు కాంబ్లీ చిన్ననాటి స్నేహితుడు కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed