‘తగ్గేదేలే అంటావా.. నా ముందుకు రా కడిగి పారేస్తా’.. అల్లు అర్జున్ పై గరికపాటి ఫైర్!(వీడియో)

by Kavitha |   ( Updated:2024-12-23 13:52:39.0  )
‘తగ్గేదేలే అంటావా.. నా ముందుకు రా కడిగి పారేస్తా’.. అల్లు అర్జున్ పై గరికపాటి ఫైర్!(వీడియో)
X

దిశ, సినిమా: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లే ఓ మహిళ ప్రాణం పోయిందని చెప్పడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే బన్నీ చెప్పిన సమాధానాలకి, థియేటర్ దగ్గర అతను చేసిన దానికి పొంతన లేదని పలు వీడియోలు వైరల్ చేస్తూ బన్నీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో గతంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.

ఆయన మాట్లాడుతూ.. ‘తగ్గేదేలే అంటావా..! రేపు ఓ పిల్లవాడు ఎవరినైనా కొట్టి తగ్గేదేలే అంటాడు. దానికి ఎవరు బాధ్యులు..? తగ్గేదేలే అని ఒక హరిశ్చంద్రుడు లాంటి వారు అనాలి. అంతేగాని ఒక స్మగ్లర్ అనడమేంటి..? దీనివల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతాయి. ఆ హీరోని, డైరెక్టర్‌ని నా ముందుకు రమ్మను కడిగి పారేస్తాను’ అంటూ పుష్ప-2 మూవీపై గరికపాటి మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.


Read More..

Seethakka: పుష్ప-2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు


Advertisement

Next Story