Winter: శీతాకాలంలో స్నానం ఎప్పుడు చేయాలి.. ఎలాంటి సోప్స్ వాడొద్దు..?

by Anjali |
Winter: శీతాకాలంలో స్నానం ఎప్పుడు చేయాలి.. ఎలాంటి సోప్స్ వాడొద్దు..?
X

దిశ, వెబ్‌డెస్క్: చలికాలం(winter) వచ్చిందంటే చాలు.. స్నానం(bath) చేయడం పెద్ద టాస్క్. వింటర్‌లో కొంతమంది చలికి భయపడి రెండ్రోజులకొకసారి చేసే వారు కూడా ఉంటారు. కొంతమంది వాటర్ హీటర్‌(Water heater)తో వాటర్ వేడి చేసుకుని స్నానం చేస్తారు. మరీ చలికాలంలో ఎప్పుడు స్నానం చేస్తే మేలని తాజాగా నిపుణులు చెబుతున్నారు. వింటర్‌లో ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తే కోల్డ్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆటోమేటిక్‌గా ఫీవర్(Fever) వస్తుంది. అంతేకాకుండా న్యుమోనియా(Pneumonia) బారిన కూడా పడే చాన్సెస్ ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఏ సమయంలో స్నానం చేయాలి..?

కాగా చలికాలంలో శరీరాన్ని బట్టి స్నానం చేస్తే మేలు. లేకపోతే జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చలికాలంలో ఎండ ఉన్నప్పుడు స్నానం చేయాలి. అంటే మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నానం చేయవచ్చని.. ఈ టైంటో ఎండ బాగా ఉంటుందని, అంతేకాకుండా తలస్నానం చేసినా కాసేపు ఎండలో కూర్చొంటే జలుబు వంటి సమస్యలు తలెత్తవని నిపుణులు సూచిస్తున్నారు.

స్నానం తర్వాత మాయిశ్చరైజర్ తప్పనిసరి

ఇక వింటర్‌లో అస్సలు చల్లనీళ్లలో మార్నింగ్, నైట్ స్నానం చేయవద్దు. తప్పక గోరు వెచ్చటి వాటర్ నే వాడండి. అలాగే స్నానం అనంతరం చర్మానికి మాయిశ్చరైజర్(Moisturizer) చేయడం మేలు. ఇది స్కిన్‌ను తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే ఆయిల్(Oil) లేదా క్రీమ్(Cream) కూడా వాడవచ్చు లేకపోతే స్కిన్ పొడిబారిపోయే అవకాశాలు ఉన్నాయి.

సోప్స్ ఎంపిక విషయంలో జాగ్రత్త

చలికాలంలో సబ్బు(Soap) వాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సోప్స్‌లో కెమికల్స్(Chemicals) ఎక్కువగా ఉంటాయి. అవి స్కిన్ కు హాని కలుగజేస్తాయి. కెమికల్స్ అధికంగా ఉన్న సోప్ ఉపయోగిస్తే చర్మం పొడిబారుతుంది. కాగా వింటర్‌లో మంచి సబ్బులను ఎంపిక చేసుకోండి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed