- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chhattisgarh: బాలీవుడ్ యాక్టర్ సన్నీలియోన్ పేరుతో ఘరానా మోసం
దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో బాలీవుడ్ యాక్టర్ సన్నీలియోన్ (Sunny Leone) పేరుతో పెద్ద ఫ్రాడ్ జరిగింది. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం వివాహితల కోసం ప్రవేశపెట్టిన మహతారీ వందన్ యోజన (Mahtari Vandan Yojana) స్కీంలో సన్నీలియోన్ పేరు ఉంటడంతో అధికారులు షాక్ అయ్యారు. దీనిపై దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం వివాహితల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, ఇటీవల రికార్డులు పరిశీలించగా.. అందులో సన్నీ లియోన్ పేరు కన్పించింది. దీనిపై విచారణ జరపగా బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామానికి చెంందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి నటి పేరుతో ఫేక్ బ్యాంకు అకౌంట్ ను తెరిచి.. మహిళలందరికీ వర్తించే ఈ పథకానికి నమోదు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. దీంతో, ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.వెయ్యి పొందుతున్నాడని పేర్కొన్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశామన్నారు.
ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు
ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ పైనా అధికారులు దృష్టి సారించారు. ఫేక్ డాక్యుమెంట్లతో లబ్ధి పొందుతుండటంతో.. బాధ్యులైన అధికారులను కూడా విచారిస్తున్నామని వెల్లడించారు. బస్తర్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ కేసుపై సమగ్ర విచారణ చేపట్టాలని.. నిందితుడి బ్యాంక్ అకౌంట్‌ను సీజ్ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు. కాగా.. ఈ విషయం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ నేతలు, అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. మహతారీ వందన్ యోజన కింద ఉన్న 50 శాతం మంది లబ్ధిదారుల ఖాతాలు నకిలీవేనని చత్తీస్ గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దీపక్ బైజ్ (Deepak Baij) ఆరోపించారు. దీనిపై ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం అరుణ్‌సావో (Arun Sao) స్పందించారు. కాంగ్రెస్ గత హయాంలో అందించని నెలవారీ సాయం ఇప్పుడు రాష్ట్రంలోని మహిళలు పొందుతున్నారని.. అందుకే ఆ పార్టీ నేతలు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు.