Medical Experiments: వైద్యులు ప్రయోగాలన్నీ ఎలుకలపైనే ఎందుకు చేస్తారో తెలుసా!

by Prasanna |   ( Updated:2024-12-23 07:53:53.0  )
Medical Experiments: వైద్యులు ప్రయోగాలన్నీ ఎలుకలపైనే ఎందుకు చేస్తారో తెలుసా!
X

దిశ, వెబ్ డెస్క్ : సైంటిస్టులు మనుషులకు సంబంధించిన ప్రయోగాలను ముందుగా ఎలుకలపై చేయడం మనం చాలా సినిమాల్లో చూశాము. ఇది కేవలం సినిమాల్లోనే కాకుండా, నిజ జీవితంలో కూడా జరుగుతుంది. అసలు, ఈ పరీక్షలన్నీ ఎలుకలపైనే ముందు ఎందుకు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

ఎలుకలు, మానవుల డి.ఎన్.ఏ DNA 85 శాతం ఒకేలా ఉంటుంది. ఈ రెండింటి రోగనిరోధక వ్యవస్థ, మెదడు , హార్మోన్ల వ్యవస్థ కూడా ఒకే విధంగా ఉంటాయి. మొదటిసారి మెడిసిన్స్ టెస్ట్ చేసే ముందు ఔషధం శరీరంలో ఎలా గ్రహించబడుతుంది, ఏ విధంగా పంపిణీ అవుతుంది అనేది అధ్యయనం చేయడానికి ఎలుకలు ఉపయోగపడతాయి.

ఎలుకలలో మానవుల కంటే వేగవంతమైన జీవక్రియ రేటు ఉంటుంది. ఔషధాలు మానవ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తక్కువ టైంలోనే తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక కొత్త మెడిసిన్ టెస్ట్ చేయాలంటే , మానవులలో దాని ప్రభావాన్ని తెలుసుకునేందుకు చాలా ఏళ్ళు పడుతుంది. కానీ, ఎలుకలపై చేస్తే వారాలు లేదా నెలల్లోనే తెలిసిపోతుంది. వీటి జీవితకాలం 2-3 ఏళ్ళు. ఇవి వైద్య ప్రయోగాలకు బాగా ఉపయోగపడతాయి. ఔషధాల భద్రత మరియు పనితీరును ప్రాథమికంగా ధృవీకరించడానికి FDA వంటి నియంత్రణ సంస్థలు పూర్వ క్లినికల్ దశలో జంతువులపై పరీక్షలు చేయాలని కోరుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed