- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: అల్లు అర్జున్ పొలిటికల్ డ్రామాలు బంద్ చెయ్.. మాజీ ఎంపీ వీహెచ్ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై(Stampede Incident) పొలిటికల్ డ్రామాలు(Political Dramas) బంద్ చేయాలని(Stopped), అల్లు అర్జున్(Allu Arjun) మృత్యుంజయ యాగం(Mrityunjaya Yagam) చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు(Senior Congress leader V Hanumantha Rao) అన్నారు. సోమవారం ఆయన గాంథీ భవన్(Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో(Assembly) హోం మంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమాచారం మాత్రమే ఇచ్చారని, దానికి బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీనిని కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని, అసలు లా అండ్ ఆర్డర్ లేదని, కక్ష సాధింపు అని పలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు బాగా లేవని మాట్లాడుతున్న కిషన్ రెడ్డి(Kishan Reddy) మణిపూర్ అల్లర్ల గురించి సమాధానం చెప్పాలన్నారు.
అంతేగాక కిమ్స్ ఆసుపత్రిలో బాలుడు శ్రీ తేజ(Sri Teja) చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని, అల్లు అర్జున్ శ్రీ తేజ కోసం మృత్యుంజయ యాగం చేయాలని సూచించారు. ఈ ఘటనలో ఏం జరగకముందే ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రకు రావాలని ఆఫర్లు ఇస్తున్నారని, అసలు ఫిలిం ఇండస్ట్రీని(Film Industry) తెలంగాణకు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ(Congress Party) అని చెప్పారు. ఆనాడు మర్రి చెన్నా రెడ్డి(Marri Chennareddy) నాగేశ్వర్ రావు(Nageshwar Rao)తో పాటు పలువురిని తీసుకొచ్చి, సినిమా వాళ్లకు కోట్ల విలువ చేసే భూములను ఇచ్చినట్లు గుర్తు చేశారు. అలాగే అల్లు అర్జున్ పై ఎలాంటి కక్ష్య లేదని, లా అండ్ ఆర్డర్ ప్రకారమే పోలీసులు కేసు పెట్టారని, చట్టం ప్రకారం బెయిల్ కూడా వచ్చిందని తెలిపారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగం ప్రకారమే సమాధానం ఇచ్చాడని, దానిపై బెయిల్ మీద ఉన్న నువ్వు ఎవరి ఐడియాలు పాటించి ప్రెస్ మీట్ పెట్టావని నిలదీశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు చేస్తున్నారని, అల్లు అరవింద్, అల్లు అర్జున్ వాళ్ల మాటలు నమ్మొద్దని సూచించారు. ఈ ఘటనపై పొలిటికల్ డ్రామాలు బంద్ చేసి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి, బాబు శ్రీతేజ బ్రతకాలని అందరూ కోరుకుందాం అని వీహెచ్ అన్నారు.
Read More..
TG: చిరంజీవి మినహా తెలుగులో అలాంటి హీరోలే లేరు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు