- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన షురూ.. 18,19 తేదీల్లో బ్రెజిల్‌లో ‘జీ20’
దిశ, నేషనల్ బ్యూరో : జీ20 సదస్సు నిర్వహణలో గతేడాది భారతదేశం(India) నెలకొల్పిన ఘన పరంపరను ఈసారి బ్రెజిల్(Brazil) కొనసాగిస్తుందని ప్రధాని మోడీ(PM Modi) ఆశాభావం వ్యక్తం చేశారు. జీ20(G20 Summit) కూటమిలోని ట్రొయికా సభ్యదేశంగా ఈ దఫా సమావేశాల్లో భారత్ పాల్గొంటోందని ఆయన తెలిపారు. ట్రొయికా దేశాలు అంటే.. గత సారి, ఇప్పుడు, రానున్న సారి జీ20 సదస్సుకు ఆతిథ్యమిచ్చే మూడు దేశాలు అని అర్థం. గత సదస్సులో భారత్ పిలుపునిచ్చిన ‘వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్’ అనే విజన్‌పై తాను అర్ధవంతమైన చర్చలు జరుపుతానని మోడీ వెల్లడించారు. గ్లోబల్ సౌత్‌కు గొంతుకగా ఉంటానని స్పష్టం చేశారు. భారత్‌తో ఇతర దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఈమేరకు మూడు దేశాల పర్యటనల వివరాలతో భారత ప్రధాని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రవాస భారతీయులను తప్పక కలుస్తా
‘‘నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్తున్నాను. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే నా లక్ష్యం’’ అని మోడీ తెలిపారు. నైజీరియాలోని ప్రవాస భారతీయుల నుంచి తనకు ఇప్పటికే స్వాగత సందేశాలు అందాయన్న భారత ప్రధాని, వారందరినీ తప్పక కలుస్తానన్నారు. ‘‘అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు నేను గయానా పర్యటనకు వెళ్తున్నాను. గత 50 ఏళ్లలో గయానాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. గయానాలో జరగనున్న 2వ ‘ఇండియా - కారికోం’ సదస్సులో పాల్గొంటాను. కరీబియన్ దేశాల అధినేతలతో సమావేశం అవుతాను’’ అని మోడీ తెలిపారు. ‘‘భారత్ నుంచి కొన్ని కుటుంబాలు 185 ఏళ్ల క్రితం గయానాకు వలస వెళ్లాయి. వారి వారసులను కలుస్తాను’’ అని ఆయన చెప్పారు.
పర్యటన షెడ్యూల్ ఇదీ..
నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల ఐదు రోజుల పర్యటన కోసం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. శనివారం రాత్రికల్లా ఆఫ్రికా దేశం నైజీరియాకు మోడీ చేరుకుంటారు. ఆదివారం (నవంబరు 17) వరకు ఆయన అక్కడే ఉంటారు. ఇక ఈనెల 18,19 తేదీల్లో బ్రెజిల్‌లో ప్రధాని పర్యటిస్తారు. ఆ దేశంలోని రియో డీ జనీరో నగరం వేదికగా జరిగే జీ 20 సదస్సులో పాల్గొంటారు. సదస్సు ముగిసిన వెంటనే దక్షిణ అమెరికా దేశం గయానాకు మోడీ వెళ్తారు. ఈనెల 20, 21 తేదీల్లో అక్కడ భారత ప్రధాని పర్యటన కొనసాగుతుంది.