- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gaza: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. గాజాలో 43,799 మంది మృతి
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్- హమాస్ (Israel-Hamas) మధ్య 13 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో గాజా(Gaza)లో ఇప్పటివరకు 43,799 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. అలాగే 1,03,601 మంది పౌరులు గాయపడ్డట్టు తెలిపింది. 24 గంటల్లోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) దాడుల్లో 35 మంది మరణించినట్టు పేర్కొంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నట్టు తెలిపింది. కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయగా 1206 మంది మరణించారు. అనంతరం 251 మందిని హమాస్ మిలిటెంట్లు బంధీలుగా చేసుకున్నారు. అప్పటి నుంచి యుద్ధం ప్రారంభం కాగా హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. దీంతో గాజాలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల విరమణ కోసం పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ అవి సత్పలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం హమాస్ వద్ద 97 మంది బంధీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా లెబనాన్ (Lebanon)పైనా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆ దేశ రాజధాని బీరూట్ పై తాజాగా ఐడీఎఫ్ విరుచుకుపడింది. దహియే, హారెట్ హ్రీక్, చియాహ్ ప్రాంతాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మరణించినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి.