టీచర్ల నిర్వాకం.. బాల కార్మికులుగా మారి ఇటుకలు మోసిన విద్యార్థులు

by srinivas |
టీచర్ల నిర్వాకం.. బాల కార్మికులుగా మారి ఇటుకలు మోసిన విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా పీఆర్ ప్రభుత్వ పాఠశాల (Kakinada District PR Govt School) విద్యార్థులు బాల కార్మికులుగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూలులో పాత బిల్డంగ్ కూలగొట్టి కొత్తది నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణ పనులను విద్యార్థుల(Students)తో చేయించారు. ఇసుక, ఇటుకలు మోయించారు. క్లాసులు చెప్పాల్సిన టీచర్లే(Teachers) దగ్గర ఉండి విద్యార్థులతో పని చేయిస్తుండటంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 12, 13 సంవత్సరాలు వయసు కూడా లేని తమ పిల్లలతో వెట్టిచాకిరి చేయించడంపై మండిపడ్డారు. కూలీలతో చేయించాల్సిన పనులను తమ పిల్లలో చేయించిన టీచర్లపై విద్యాశాఖ ఉన్నతాధికారులు(Education officials) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే ప్రతి పనికి కూడా విద్యార్థులతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. తాగునీటి కోసం కూడా వాటర్ ట్యాంకు వద్దకు పంపిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. టీచర్లకు భయపడి ఎదురు చెప్పలేక చెప్పిన ప్రతి పనిని విద్యార్థులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక నుంచైనా విద్యార్థులకు పనులు చెప్పకుండా విద్యాబుద్ధులు నేర్పాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed