రుచికరమైన స్ట్రాబెర్రీ చీజ్‌ కేక్‌ను ఇలా తయారుచేసుకోండి!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-16 14:58:21.0  )
రుచికరమైన స్ట్రాబెర్రీ చీజ్‌ కేక్‌ను ఇలా తయారుచేసుకోండి!
X

దిశ, ఫీచర్స్: వివాహానికి, పుట్టిరోజులకు చిన్న చిన్న ఫంక్షన్లకు కేక్‌ కట్ చేసి వేడుక చేసుకుంటారు. ఈ కేక్‌లలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా కేక్‌ను ఇష్టంగా తింటుంటారు. మరి అలాంటి రుచికరమైన కేక్‌ను స్ట్రాబెర్రీ చీజ్, వెనిలా ఐస్ క్రీమ్‌తో ఇంట్లోనే టేస్టీగా తయారుచేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ స్ట్రాబెర్రీ చీజ్ కేక్‌ను ఎలా తయారు చేసుకోవాలో చదివేయండి.

కావలసిన పదార్థాలు:

స్ట్రాబెర్రీలు - 10

కోడి గుడ్లు - 5

మైదా - ఒకటిన్నర కప్పు

బటర్ - 1 కప్పు

కోకోపౌడర్ - 2 టేబుల్ స్పూన్లు

వెనీలా ఎసెన్స్ - 1 టేబుల్ స్పూన్

బేకింగ్ సోడా - అర టేబుల్ స్పూన్

ఉప్పు - పావు స్పూన్

పంచదార - 2 కప్పులు

పెరుగు - అరకప్పు

బేకింగ్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా ఒక బౌల్‌లో బటర్, మైదా, పంచదార, వెనిలా ఎసెన్స్, కోకోపౌడర్, బేకింగ్ సోడా, గుడ్లు వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తరువాత అందులో పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ పాన్ లేదా కేక్ టిన్ తీసుకొని, దాని చుట్టూ బటర్‌ను అప్లై చేయాలి. కలుపుకున్న మిశ్రమాన్ని పాన్‌లో వేసుకోవాలి. తరువాత స్ట్రాబెర్రీలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఈ మిశ్రమంపై వేయాలి. ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో ఉప్పు లేదా ఇసుక వేసుకొని, స్టాండ్ పెట్టి మూతపెట్టాలి. ఐదునిమిషాల పాటు గిన్నెను ఫ్రీ హీట్ చేయాలి. ఇలా హీట్ చేసుకున్న గిన్నెలో కేక్ మిశ్రమం ఉంచిన టిన్‌ని ఉంచాలి. ఇలా 30-35 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అంతే రుచికరమైన స్ట్రాబెర్రీ చీజ్ కేక్ రెడీ.

Read More...

బ్రోకలి క్యాన్సర్‌కు చెక్ పెడుతుందా..? అధ్యయనాలు ఏం చెబున్నాయంటే..!





Advertisement

Next Story