Gaddar Daughter Vennela : గద్దర్ కూతురికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పదవి

by Ramesh N |
Gaddar Daughter Vennela : గద్దర్ కూతురికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పదవి
X

దిశ, తెలంగాణ/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే 'తెలంగాణ సాంస్కృతిక సారథి'కి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి.వి.వెన్నెల (గద్దర్ కూతురు)ని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, వర్క్ షాపులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రచారం చేయిస్తారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గతంలో చైర్మన్‌గా అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమించింది. ఇక 2023 సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల ఓటమి పాలైన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు చైర్ పర్సన్‌గా కీలక బాధ్యతలు ఇచ్చారు.

Advertisement
Next Story

Most Viewed