- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లిని, చెల్లిని అవమానిస్తే వదిలేయాలా: సీఎం చంద్రబాబు మరోసారి సీరియస్
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా అసభ్య పోస్టులపై ఏపీ ప్రభుత్వం(AP Government) ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. మరికొంతమందికి నోటీసులు జారీ చేసింది. దీంతో అరెస్ట్‌ల పర్వం కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఢిల్లీ హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్(Delhi Hindustan Times Leadership Summit)లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సోషల్ మీడియా పోస్టులపై మరోసారి సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయన్నారు. వ్యక్తిత్వ హననం జరుగుతోందని మండిపడ్డారు. నాయకులను, మహిళలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల కుటుంబాలపైనా అసభ్యకరంగా బూతులు తిడుతున్నారని ధ్వజమెత్తారు. అలా బూతులు తిట్టిస్తున్న వారిని ఏం చేయాలని ప్రశ్నించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవద్దా అని నిలదీశారు. సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తున్న వారిని ఎలా నియంత్రించాలనే అంశంపై తీవ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు.