27న వైసీపీ పోరుబాట.. పోస్టర్ విడుదల

by srinivas |
27న వైసీపీ పోరుబాట.. పోస్టర్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల(Electricity charges) పెంపును నిరసిస్తూ ఈ నెల 27న పోరుబాట(Porubata) చేపట్టాలని పార్టీ నేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్(YSR Congress chief Jagan) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనకు సంబంధించిన పోస్టర్‌ను తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం(Tadepalli YCP Central Office)లో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున(Merugu Nagarjuna), వెల్లంపల్లి శ్రీనివాసరావు(Vellampally Srinivasrao), జోగి రమేష్(Jogi Ramesh), ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి(lella Appireddy), కల్పలతారెడ్డి తదితరులు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబు పాలన కాదని... 'చంద్రబాదుడు' పాలన అని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15,485 కోట్లు భారాన్ని మోపడం దుర్మార్గమని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story