ధనుష్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ‘ఇడ్లీ కడై’ రిలీజ్ వాయిదా!

by Hamsa |
ధనుష్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ‘ఇడ్లీ కడై’ రిలీజ్ వాయిదా!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ఓ వైపు సినిమాలు తెరకెక్కిస్తూనే పలు ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. గత ఏడాది ‘రాయన్’(Raayan)మూవీతో హిట్ అందుకున్నారు. ఇక ఇటీవల ‘జాబిలమ్మ నీకు అంత కోసమా’చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ధనుష్ స్వయం దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై’(Idli Kadai). దీనిని వండర్‌బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్(Dawn Pictures) బ్యానర్స్‌పై నిర్మించనున్నారు.

అయితే ఇందులో నిత్యామీనన్ (Nithya Menon)హీరోయిన్‌గా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ‘ఇడ్లీ కడై’ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాల్ షీట్ల కారణంగా రిలీజ్ లేట్ అయ్యేలా ఉన్నట్లు నిర్మాత వెల్లడించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటించనున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ధనుష్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Advertisement
Next Story