- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పట్టుదల ఉంటే ఏదైనా సుసాధ్యమే..

దిశ, చండూరు : అన్ని అవకాశాలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఆపసోపాలు పడేవారు కొందరైతే.. కటిక పేదరికం ఓ వైపు వెక్కిరిస్తున్నా, కంటి చూపు లేకపోయినా మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఎంతో మంది నిరుద్యోగులకు ఈ యువకుడు ఆదర్శంగా నిలిచాడు. నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన వరికుప్పల ఇద్దయ్య, ఇద్దమ్మలకు ఇద్దరు అబ్బాయిలు,ఇద్దరు అమ్మాయిలు. ఇందులో చిన్నవాడైనా రాజు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి 478 వ ర్యాంక్ సాధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగానికి ఎంపికయ్యారు.
బాల్యం నుండే సరైన కంటి చూపు లేకపోయినా చదువు పై ఎంతో ఆసక్తి కనబరిచేవాడు. పదవ తరగతి వరకు గట్టుప్పల్ సిద్ధార్థ హై స్కూల్ , ఇంటర్ శ్రీ మేధా కాలేజీ చౌటుప్పల్, డిగ్రీ నిజాం ఓయూ కాలేజీ, బీఈడీ మర్రిగూడ ఎన్ రిచ్ కాలేజీ మర్రిగూడలో తన విద్యాభ్యాసం కొనసాగిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా అతని తండ్రి డయాలసిస్ తొ బాధపడుతుండగా తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ రాజుని చదివించింది. తమ పేదరికాన్ని చూసి కొంత మంది తన చదువు కొనసాగించటానికి సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3 పరీక్షలు కూడా రాసానని అందులో కూడా మంచి మార్కులు వచ్చి ఇంకా ఉన్నత స్థాయి ఉద్యోగం సంపాదిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. కష్టాలను అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన రాజును కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.