- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సెన్సార్ పూర్తి చేసుకున్న సికిందర్ మూవీ.. ఏ సర్టిఫికెట్ వచ్చిందో తెలుసా..

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికిందర్’(Sikindar). ఎ ఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ మూవీలో సత్యరాజ్(Sathyaraj), శర్మాన్ జోషి(Sharman Joshi), ప్రతీక్ బబ్బర్(Pratheek Babbar) వంటి ప్రముఖులు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్(Posters), టీజర్స్(Teasers) సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. కాగా ఉగాది(Ugadi), రంజాన్(Ramzan) పండగల కానుకగా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా విడుదలవుతుండడం గమనార్హం.
ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ శుక్రవారం (మార్చి 21)తో పూర్తయింది. థియేటర్లలో విడుదల కానున్న ఈ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 38 సెకన్లు. ఇక సినిమా నిడివి 150.8 నిమిషాలు. అంటే 2 గంటల 30 నిమిషాల పాటు మూవీ ఉంటుంది. ఇక సికందర్ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది, అంటే 13 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు దీనిని చూడవచ్చు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.