దక్షిణాదికి బీజేపీ అన్యాయం చేయదు.. BJP ఎంపీ ప్రకటన

by Gantepaka Srikanth |
దక్షిణాదికి బీజేపీ అన్యాయం చేయదు.. BJP ఎంపీ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు‌(Tamil Nadu)లోని చెన్నై వేదికగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) నేతృత్వంలో అఖిలపక్ష నేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సమావేశంపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టాలిన్ డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే సమావేశం జరిగిందని విమర్శించారు. వచ్చేఎన్నికల్లో ఓటమి తప్పదనే స్టాలిన్ కొత్త ఎత్తుగడ ప్రారంభించారని.. అందులో ఇతర రాష్ట్రాల నేతలను కూడా ఇన్వాల్వ్ చేసి వాడుకుంటున్నారని అన్నారు. దక్షిణాదిన బలపడుతున్నదనే బీజేపీపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చెన్నై వేదికగా కాంగ్రెస్- బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. డీలిమిటేషన్‌(Delimitation)పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 2026 వరకు డీలిమిటేషన్‌పై ఫ్రీజ్ ఉందని గుర్తుచేశారు. దక్షిణాది(Southern)కి బీజేపీ(BJP) అన్యాయం చేయదు అని హామీ ఇచ్చారు.

డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని.. కాంగ్రెస్, డీఎంకే(DMK), బీఆర్ఎస్(BRS) అపోహలు సృష్టిస్తున్నాయని నిన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీజేపీపై విషం కక్కడమే వారి అజెండా అని దుయ్యబట్టారు. కాంగ్రెస్, డీఎంకేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని.. అందుకే భయంతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని అన్నారు. ప్రతిపక్షాలు రిజర్వేషన్లు, డీలిమిటేషన్ పేరిట కుట్ర చేస్తున్నాయని.. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాయని నిప్పులు చెరిగారు. సౌత్ ఇండియాపై ప్రధాని మోడీకి ప్రత్యేక ప్రేమ ఉందని స్పష్టం చేశారు.

Next Story