భర్తలతో శృంగారానికి నిరాకరిస్తున్న భార్యలు.. ఎందుకో తెలిస్తే కంటిమీద కునుకు ఉండదు!

by Sujitha Rachapalli |   ( Updated:2025-03-23 07:17:36.0  )
భర్తలతో శృంగారానికి నిరాకరిస్తున్న భార్యలు.. ఎందుకో తెలిస్తే కంటిమీద కునుకు ఉండదు!
X

దిశ, ఫీచర్స్ : భార్యాభర్తల బంధం వందేళ్లు హాయిగా సాగాలంటే అన్నింట్లో బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. ప్రజెంట్ పరిస్థితి అలాగే ఉంది. ఆర్థికంగా ఎదగడం నుంచి ఇంట్లో పనుల వరకు ప్రతీ విషయంలోనూ ఇద్దరి భాగస్వామ్యం సమానంగా ఉండాల్సిందే. ఒకప్పటి మాదిరిగా భర్త సంపాదించి తీసుకొస్తాడు.. భార్య ఇంటిని తీర్చిదిద్దాలి అనే రోజులు ఇప్పుడు దాదాపు మాయమైపోయాయనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఓ అధ్యయనం ఇంట్రెస్టింగ్ టాపిక్‌పై పరిశోధన చేసింది. హౌజ్ వర్క్ షేరింగ్.. హజ్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది విషయం.

ఇందులో భాగంగానే దాదాపు వందల మంది జంటల అభిప్రాయాలను సేకరించిన పరిశోధకులు.. కొన్ని ప్రయోగాత్మక పనులను కూడా చేయించారు. ఇందులో మహిళల ఒపీనియన్ చూసి షాక్ అయ్యారు. భర్తలు ఇంటి పనుల్లో సహాయం చేయకుండా పొద్దస్తమానం కూర్చుని ఉండటం.. అన్ని విషయాల్లో తనపైనే ఆధారపడటం భార్యలకు నచ్చదట. పైగా ఇలా డిపెండింగ్ హజ్బెండ్స్‌ను చూస్తే మూడ్ కూడా రాదని.. శృంగారంలో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ ఉండదని చెప్పారట. ఇలాంటి వ్యక్తితో జీవితాన్ని షేర్ చేసుకోవడమేంటనే ఆలోచనతో ఉంటారని చెప్తుంది తాజా అధ్యయనం.

Next Story