- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు.. ప్రభాస్ సహా మరో ఇద్దరు స్టార్ హీరోలపై ఫిర్యాదు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Promotions) కేసు హాట్ టాపిక్ (Hot topic)గా మారింది. ఈ కేసులో ఇప్పటికి సోషల్ మీడియా ఇన్ఫ్యూయేన్సర్లతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే తెలంగాణలోని పలు జిల్లాల్లో బెట్టింగ్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న యువకులు ఆత్మహత్య (Youth suicide) చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోల (Tollywood star heroes)పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తుండగా మరి కొందరు నేరుగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తున్నారు.
ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), గోపీచంద్‌తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan India Star Prabhas) పై తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు (Cybercrime police) రామా రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా.. స్టార్ హీరోలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ (Star Heroes Betting App Promotions) చేయడంతో లక్షలాది మంది డబ్బు పోగొట్టుకున్నారని, మ్యూల్ ఖాతాల ద్వారా చైనీయులకు ఈ నగదు చేరిందని రామారావు ఆరోపించారు. కాగా ఈ ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.
READ MORE ...
ప్రభాస్‌కు అన్నగా నటించబోతున్న స్టార్ నటుడు.. సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరిందిగా అంటున్న నెటిజన్లు